‘యాత్ర’ ఫస్ట్ సాంగ్...

x
Highlights

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది...

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కనిపించ‌నుండ‌గా, వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసారు. అయితే ఈ రోజు వైఎస్ఆర్ 9వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా స‌మ‌రశంఖం అనే సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో వైఎస్ఆర్‌లా మ‌మ్ముట్టి ప్ర‌ద‌ర్శిస్తున్న హావ‌భావాల‌ని చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కృష్ణ కుమార్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ ని క‌ళా భైర‌వ పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories