టీడీపీ ఓడుతుందన్న సర్వేపై చంద్ర‌బాబు రియాక్షన్..!

Submitted by lakshman on Sun, 01/21/2018 - 19:16
C Voter - Republic Tv Survey

పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ జ‌గ‌న్ కు గురించి నేష‌న‌ల్ మీడియా స‌ర్వే నిర్వ‌హించింది. ఆ స‌ర్వేలో 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విజ‌యం సాధిస్తాడ‌ని తేలింది. ఎంపీ సీట్ల‌ను ప్రాతిప‌దిక‌తో గెలుపు ఓట‌ములపై స‌ర్వే నిర్వ‌హించ‌గా వైసీపీ విజ‌యం అనేది తేట‌తెల్ల‌మైంది. 
 సీ - ఓట‌ర్ స‌ర్వే 
2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్. జ‌గ‌న్ గెలుస్తాడని  కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ గోస్వామి దేశంలోని ఎంపీల సీట్ల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకొని సీ - ఓట‌ర్ అనే స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో  వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌నే విష‌యం తేట‌తెల్ల‌మైంది. దేశవ్యాప్తంగా ఎన్డీయే హవా కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  పోటీ చేస్తే ఏపీలో ఉన్న25 ఎంపీ సీట్లలో 13 సీట్లను వైసీపీ గెలుస్తుంద‌ని తేల్చి చెప్పింది. బీజేపీ తో పొత్తు ఉంటే టీడీపీకి  12 సీట్లు అవ‌కాశం ఉంది. లేదంటే అన్ని సీట్లు దక్కడం కూడా కష్టమేన‌ని సూచించింది. 
రాష్ట్రంలో వైసీపీ అధికారం దిశ‌గా అడుగులు వేస్తూ ఒక్కో ఎంపీ సీటు కనీసం ఏడు అసెంబ్లీ స్థానాల,  అంతకు మించి కూడా ప్రభావాన్ని చూపుతాయంట‌. ఇక కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌ని ఏపీ ప్ర‌జ‌లు కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.  ఎంపీ సీట్ల విషయంలో వైసీపీ హవా ఉంటుందని ...అదే అంశం ఎమ్మెల్యే సీట్ల విష‌యంలో  సానుకూలత చూపించ‌నుంది. 
కాగా ఈ స‌ర్వే ఆధారంగా ఏపీలో ప్ర‌భుత్వానికంటే ప్ర‌తిప‌క్ష‌పార్టీ బ‌లంగా ఉంద‌నేది ఆసక్తిదాయకమైన అంశం. ఇదే హ‌వా ఎన్నిక‌ల స‌మయంలో కూడా కొన‌సాగితే వైసీపీ కి లాభం చేకూరుతుంద‌ని పొలిటిక‌ల్ క్రిటిక్స్ చెబుతున్న‌మాట‌. 
అయితే ఈ స‌ర్వేపై సీఎం చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ఆ స‌ర్వే అంతా ప‌చ్చిబూట‌క‌మ‌ని అన్నారు. ప్ర‌జా సేవే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తున్నప్పుడు..అలాంటప్పుడు తాము ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతామ‌ని చంద్ర‌బాబు ఎదురు ప్రశ్నించారు.

English Title
YS Jagan Will be the CM of AP | C Voter - Republic Tv Survey

MORE FROM AUTHOR

RELATED ARTICLES