నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం 'ఆమె'నే : వైయస్ జగన్

Submitted by chaitanya on Sun, 05/13/2018 - 11:15
ys jagan tweet about mothers day

నిత్యం ప్రజలతో బిజీ బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్ నేడు ఆమె వల్లే ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చారు.ట్విట్టర్ వేదికగా మాతృ దినోత్సవాన్ని పురష్కరించుకొని వైయస్ జగన్ తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం ఇంకోటి లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు' తెలిపారు. కాగా ప్రస్తుతం  వైయస్ జగన్ కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. అయన ఇప్పటికే 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. రేపు (సోమవారం) ఏలూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. 

English Title
ys jagan tweet about mothers day

MORE FROM AUTHOR

RELATED ARTICLES