తూర్పుగోదావరిలో వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం

Submitted by arun on Tue, 06/12/2018 - 17:05
JAGAN

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర తూర్పుగోదావరిలోకి ప్రవేశించింది. రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి మీదుగా కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లోకి జగన్‌ అడుగుపెట్టారు. దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల పొడవు ఉండే.... రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జిపై జగన్‌ పాదయాత్ర సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజమండ్రి బ్రిడ్జిపైకి అడుగుపెట్టిన జగన్‌కు వైసీపీ శ్రేణులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు.

రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జిపై... జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు. బ్రిడ్జిపైనే కాకుండా గోదావరి నదిలోనూ వందలాది పడవలతో... గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. బ్రిడ్జికి ఇరువైపులా వైసీపీ జెండాల రెపరెపలతో పడవలు ముందుకు కదిలాయి. జగన్‌ పాదయాత్రకు అనుగుణంగా వందలాది పడవలు రాజమండ్రి వైపు కదిలాయి. 2003లో వైఎస్సార్‌ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ.... స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్‌రావు.... గోదావరిలో ఇలా బోట్లను ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆయన తనయుడు జక్కంపూడి రాజా.... వందలాది పడవలతో జగన్‌‌‌కు స్వాగతం పలికారు.

2003 మే 23న మండుటెండల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే బ్రిడ్జిపై నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. వైఎస్‌ పాదయాత్రతో ఆనాడు 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో.... ఇప్పుడు వైసీపీ శ్రేణులు సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. తూర్పుగోదావరిలో జగన్‌ ప్రజాసంకల్ప యాత్రను సూపర్ సక్సెస్‌ చేసేందుకు భారీ జనసమీకరణ చేశారు. దాంతో రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్ జనసంద్రమైంది.

English Title
ys jagan prajasankalpayatra enters east godavari

MORE FROM AUTHOR

RELATED ARTICLES