నేడు వైసీపీలోకి బీజేపీ కీలక నేత..

Submitted by nanireddy on Sat, 09/08/2018 - 07:56
ys-jagan-prajasankalpa-yatra-visakhapatnam-city-today

ఒకవైపు ముందస్తు ఎన్నికల సందర్బంగా తెలంగాణలో వలసల జోరు మొదలైతే.. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలోకి జంపింగులు ఊపందుకున్నాయి. నేడు వైసీపీలో చేరడానికి ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్నారు. మాజీ  ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు.. రామ్‌కుమార్‌రెడ్డి. దీంతో అయన చేరిక సందర్బంగా విశాఖలో భారీ ఏర్పాట్లు చేశారు.  కాగా రెండు పర్యాయాలు విశాఖ ఎంపీగా ఉన్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. తదనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన రామ్‌కుమార్‌రెడ్డి మొదట బీజేపీలో చేరారు. అక్కడ భవిశ్యత్ బెంగంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇంతకుముందే జగన్ ను కలిశారు. ఇక వైయస్ జగన్‌ శనివారం పాదయాత్రలో భాగంగా విశాఖ నగరంలోకి అడుగు పెట్టనున్నారు. అందుకోసం విశాఖ వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.  ఈ క్రమంలో  కోటనరవకాలనీ వద్ద  రామ్‌కుమార్‌ తన అనుచరులతో కలిసి వైయస్ఆర్సీపీ లో చేరనున్నన్నట్టు సమాచారం. 

English Title
ys-jagan-prajasankalpa-yatra-visakhapatnam-city-today

MORE FROM AUTHOR

RELATED ARTICLES