చంద్ర‌బాబు ఓటుకు మూడు వేలు ఇస్తారు.. తీసుకోండి!: జ‌గ‌న్

Submitted by arun on Mon, 02/05/2018 - 18:58
YS Jaganmohan

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అడుగుతారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఎన్నో మాయమాటలు చెప్పిన తనను ప్రజలు ఇక నమ్మబోరని చంద్రబాబు భావించే అవకాశం కూడా ఉందని అందుకే, ఓటు వేయమని డబ్బులు ఇస్తారని వ్యాఖ్యానించారు.

 'డబ్బిస్తారు వద్దని చెప్పకండి తీసుకోండి, చంద్ర‌బాబు ఓటుకు మూడు వేలు ఇస్తారు తీసుకోండి. కారణం ఏంటో తెలుసా?.. ఆ డబ్బు మనది, మనల్ని దోచేసి సంపాదించిన డబ్బు. కానీ, ఆ డబ్బు తీసుకొని ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయతీ అన్న పదం రావాలి. రాజకీయాల్లో నిజాయతీ రావాలంటే ఒక్క జగన్ తోనే అయ్యే పని కాదు. మీ అందరి తోడు కావాలి. దేవుడి దయ వల్ల వచ్చే ఎన్నికల తరువాత మన ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడు, రైతుల ముఖంలో చిరునవ్వులు చూస్తాం. అని జగన్ అన్నారు.
 

English Title
ys jagan mohan reddy slams cm chandrababu naidu

MORE FROM AUTHOR

RELATED ARTICLES