జగన్ సాహసం.. 134 మీటర్ల లోతు నీటిలోకి దూకిన వైసీపీ అధినేత

Submitted by arun on Fri, 07/06/2018 - 17:06

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన విమర్శలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వేసిన సెటైర్లో లేక ఆయన ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించిన వీడియోనో కాదు. గతేడాది వైసీపీ అధినేత జగన్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ కు విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అనునిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వైసీపీ అధినేత తన కుటుంబసభ్యులతో కలసి ఆ పర్యటనను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్ పై నుంచి ఆయన 134 మీటర్ల బంగీ జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. 


 

English Title
YS Jagan Bungy Jump at Kawarau, New Zealand

MORE FROM AUTHOR

RELATED ARTICLES