పులివెందుల జన్మభూమి సభలో ఎంపీకి అవమానం

Submitted by arun on Wed, 01/03/2018 - 18:33
janmabhoomi programme

పులివెందుల జన్మభూమి సభలో టీడీపీ నేతలు బుధవారం ఓవరాక్షన్‌ చేశారు. గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఓ దశలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆయనను చుట్టుముట్టి... చేతిలోని మైక్‌ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఎంపీ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. సాక్షాత్తూ సీఎం కూడా అదే పంథాను అనుసరించారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి మాట్లాడనివ్వకుండా ఏయ్‌..మైక్‌ తీసుకో... ఇక్కడ ఏమీ మాట్లాడవద్దు అంటూ మైక్‌ కట్‌ చేయించారు. అంతేకాకుండా ఎవరేం చేశారో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు, చెప్పదలుచుకున్న విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. అయితే చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపై అవినాష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

English Title
ys avinash reddy mike cut pulivendula janmabhoomi programme

MORE FROM AUTHOR

RELATED ARTICLES