యూట్యూబ్‌లో 10 వేల ఉద్యోగాలు.. ఎందుకో తెలుసా?

Submitted by admin on Tue, 12/12/2017 - 17:17

యూట్యూబ్ కొత్తగా పది వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. వీళ్లు చేయాల్సిన పనేంటో తెలుసా? అందులో ఉన్న హింసాత్మక, రెచ్చగొట్టే, అభ్యంతకర వీడియోలను తొలగించడం, నియంత్రించడం. అంతేకాదు పిల్లలను చెడుదోవ పట్టించే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం. చాలా మంది యూట్యూబ్‌ను అడ్డంగా పెట్టుకొని నెటిజన్లను తప్పుదోవ పట్టించడం, హింసించడం చేస్తున్నారని ఆ సంస్థ సీఈవో సుసాన్ వోజికి అన్నారు. తమ విధానాలకు విరుద్ధంగా యూట్యూబ్‌లో లోడ్ అవుతున్న ఇలాంటి వీడియోల ఆట కట్టించడానికి వచ్చే ఏడాది పది వేలకు పైగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు సుసాన్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విటర్‌ చర్యలు చేపట్టాయి. తాజాగా యూట్యూబ్‌ కూడా ఆ జాబితాలో చేరింది. 

English Title
youtube-will-hire-10000-people-monitor-and-control-violent-extremism

MORE FROM AUTHOR

RELATED ARTICLES