తన ప్రియురాలు మరో యువకుడితో స్నేహం చేస్తుందని...

తన ప్రియురాలు మరో యువకుడితో స్నేహం చేస్తుందని...
x
Highlights

తన ప్రియురాలు వేరే యువకుడితో స్నేహం చేస్తోందని ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రాంత పరిధిలో మంగళవారం...

తన ప్రియురాలు వేరే యువకుడితో స్నేహం చేస్తోందని ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రాంత పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. నిజాంనగర్ ప్రాంత వాసి రిజ్వాన్‌ఖాన్ (20) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత 11 నెలలుగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేయసి మరో యువకుడితో స్నేహంగా ఉంటుందని తెలిసిన రిజ్వాన్ ఖాన్ ప్రేయసితో గొడవపడ్డాడు. అనంతరం కత్తి తీసుకొని ప్రియురాలి మెడ కోసి రెండు ముక్కలు చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి రెండు బ్యాగుల్లో పెట్టాడు. ప్యాక్‌ చేసి సమీపంలోని బారాపుల్లా ఫ్లైఓవర్‌ కిందగల మురికి కాలువలో పడేశాడు. హత్యచేసిన అనంతరం తానే స్వయంగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. తన ప్రేయసి వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న కారణంతో ఆమెను హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో.. కేసు నమోదు చేశారు. అతని సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories