తిరుమల శ్రీవారికి సాహస పూజ.. భక్తిలో ప్రాణాలతో చెలగాటమాడుతున్న యువకులు

Submitted by admin on Wed, 12/13/2017 - 15:38

కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని భక్తులు పలు విధాల ఆరాధించి వారివారి భక్తిని చాటుకుంటుంటారు. అయితే తిరుమల శేషాచల కొండల్లో దర్శనమిచ్చే స్వామివారి సహజశిలా రూపానికి స్థానిక యూవకులు సాహసోపేతమైన పూజలు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపులో ఉన్న ఎత్తైన కొండ చివరి భాగంలో స్వామివారి సహజ రూపం దర్శనమిస్తుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారు ఆ సహజ శిలా మూర్తికి నమస్కరించుకుని తిరుమల చేరుకుంటారు. అయితే స్థానిక యువకులు కొందరు ఆ ఎత్తైన కొండపైకి చేరుకొని పాలాభిషేకాలు నిర్వహించి, గజమాల వేశారు. గోవిందుడిపై తమ అపార భక్తిని చాటుకున్నారు. వినడానికి బాగున్నా ఆ శిలారూపానికి వారు చేసే పూజ విధానాని చూస్తే ప్రమాదకరంగా ఉంది.

కొండ అంచుల్లో నిల్చొని, ఒంటికి తాళ్లు కట్టుకొని వేలాడుతూ పూజలు చేయడం చూస్తుంటే ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం కలుగకమానదు. స్వామిపై భక్తితో కన్నుమిన్ను తెలియకుండా ఆ యువకుల చేస్తున్న సాహసోపేతమైన పూజలను అడ్డుకొవాల్సిన టీటీడీ చోద్యం చూస్తుండటం పలు విమర్శలకు తావిస్తొంది. ఈ సాహసోపేతమైన పూజలకు అడ్డుకట్టవేయకపోతే భక్తి మత్తులో యువకులు ప్రాణాలు పొగొట్టుకునే ప్రమాదం లేకపోలేదు.

English Title
young-stars-offers-special-prayers

MORE FROM AUTHOR

RELATED ARTICLES