ఎట్టకేలకు వైసీపీ ఎంపీలపై స్పీకర్ నిర్ణయం..

Submitted by nanireddy on Thu, 06/21/2018 - 19:10
ycp-mps-resignations-taken-decision-by-speaker

ఎట్టకేలకు వైసీపీ ఎంపీలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా... ఐదుగురు వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. ఏప్రిల్‌ 6 వ తేదీన పదవులకు రాజీనామాలు సమర్పించిన ఎంపీలు... వాటిని ఆమోదించాలంటూ స్పీకర్‌ను కోరారు. భావోద్వేగాల మధ్య తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని స్పీకర్‌ సూచించగా... జూన్‌ ఆరోతేదిన మరోసారి స్పీకర్‌తో భేటీ అయ్యారు ఎంపీలు. మరోసారి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. ఈ మేరకు స్పీకర్‌ అడిగిన రీకరన్ఫర్మేషన్‌ లేఖలను కూడా సమర్పించారు. అయితే స్పీకర్‌ విదేశీ పర్యటనకు వెళ్లడంతో వాటికి ఆమోదముద్ర పడడం ఆలస్యమైంది. తుది పరిశీలన అనంతరం.. స్పీకర్‌ సుమిత్ర ఐదుగురు వైసీపీ ఎంపీల రిసిగ్నేషన్లను ఆమోదించారు

English Title
ycp-mps-resignations-taken-decision-by-speaker

MORE FROM AUTHOR

RELATED ARTICLES