ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వైసీపీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Submitted by lakshman on Thu, 03/15/2018 - 14:24
YCP MP Vara Prasad Rao Sensational Comments On Pawan Kalyan

జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్దుతు ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌సారిగా టీడీపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఏపీలో రాజ‌కీయం వేడెక్కింది. సీఎం చంద్ర‌బాబు , నారాలోకేష్ చేసిన అవినీతిపై విమ‌ర్శ‌లు చేయ‌డం టీడీపీనేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. దీంతో త‌న పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయిన చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు అర్ధ‌ర‌హిత‌మ‌ని అన్నారు. గుంటూరులో స‌భ‌పెట్టింది మమ్మ‌ల్ని ఆడిపోసుకోవ‌డానికే అన్నఅనుమానం క‌లుగుతుంద‌ని అన్నారు. 
ఇదిలా ఉంటే గుంటూరు స‌భ‌లో ఏపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్ కేంద్రాన్ని , ఇటు వైసీపీ గురించి మాట్లాడ‌క‌పోవ‌డంపై టీడీపీ నేత‌లు ప‌లు అనుమానులు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ మీడియాతో చిట్ చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌వన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మాట్లాడిన ఆయ‌న ప్ర‌త్యేక‌హోదాకోసం వైసీపీ - జ‌న‌సేన క‌లిసి ప‌నిచేస్తాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
అంతేకాదు త‌నని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోన్ చేసి ఆహ్వానిస్తే తాను వెళ్లిన‌ట్లు చెప్పారు. ప‌వ‌న్ భేటీలో తాజా రాజ‌కీయా గురించి చర్చించామ‌ని , వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత వైసీపీకి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇస్తామ‌ని హామి ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. 
ఇక వైసీపీ నేత‌లు త‌న‌ని ఎందుకు విమ‌ర్శిస్తున్నార‌ని ప‌వ‌న్ అన్నార‌ని, అందుకు టీడీపీకి జ‌న‌సేన మ‌ద్దుతు ఇవ్వ‌డం వ‌ల్లే అలా విమ‌ర్శ‌లు చేసినట్లు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలిపారు. 
అంతేకాదు ఇకపై తాను టీడీపీకి మ‌ద్దుతు ఇచ్చేదిలేద‌ని ప‌వ‌న్ చెప్పిన‌ట్లు వైసీపీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ తెలిపారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి తాను ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వచ్చిందో వివ‌రించార‌ని ఆయ‌న చెప్పారు. 
తాజాగా వైసీపీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత వైసీపీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా ఇప్పటికే మరింత హీట్‌ను పెంచాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ టిడిపిపై విమర్శలను గుప్పించారు.
 

English Title
YCP MP Vara Prasad Rao Sensational Comments On Pawan Kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES