సంచలనంగా మారిన బీజేపీ, వైసీపీ నాయకుల దృశ్యాలు

x
Highlights

ఢిల్లీ పరిణామాలు.. ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయ్. హస్తినలో బీజేపీ, వైసీపీ నేతలు మీట్ అయ్యారని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదని,...

ఢిల్లీ పరిణామాలు.. ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయ్. హస్తినలో బీజేపీ, వైసీపీ నేతలు మీట్ అయ్యారని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదని, అంతా అవాస్తవమేనని.. వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది. వాళ్లేం చేశారు.. వీళ్లేం చూశారు.. వాస్తవాలేంటి.?

ఢిల్లీ దృశ్యాలే.. ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. హస్తిన వేదికగా.. బీజేపీ, వైసీపీ నేతలు సమావేశమయ్యారన్న వార్తలు పొలిటికల్‌ హీట్ పెంచాయి. దీంతో.. బీజేపీ, వైసీపీ కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరిందని టీడీపీ చెప్తోంది.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలను వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్.. అమిత్ షాకి అందించినట్లు టాక్ వినిపిస్తోంది. పీఏసీ ఛైర్మన్‌గా అనేక విషయాలను లోతుగా పరిశీలించిన బుగ్గన.. ఫుల్ డీటైల్డ్ రిపోర్ట్‌ను షాకి సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, ఆకుల సత్యనారాయణతో కలిసి బుగ్గన.. అమిత్ షాతో సమావేశమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంచలన భేటీకి రాంమాధవ్ మధ్యవర్తిత్వం వహించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు.. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి బుగ్గన వెళ్తున్న విజువల్స్ బయటికి రావడం.. ఇప్పుడు సంచలనంగా మారింది.

ఢిల్లీలో బీజేపీ, వైసీపీ కదలికలపై మంత్రి లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాహనం దిగి వెళ్తున్న వీడియోను.. లోకేష్ ట్వీట్ చేశారు. బుగ్గన ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారని ఆరోపించిన లోకేష్ దీని వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ స్నేహానికి ఈ మంతనాలే నిదర్శనమని ట్వీట్ చేశారు.

బీజేపీ, వైసీపీ కలిసి చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీజేపీకి... వైసీపీ సిస్టర్ పార్టీ అంటూ విమర్శించారు. బుగ్గన రాజేంద్రనాథ్.. ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడంతో బీజేపీ-వైసీపీ కుట్ర రుజువైందన్నారు. బీజేపీతో జగన్ అంటకాగుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు.

లోకేష్ ట్వీట్‌పై.. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన స్పందించారు. ఏపీ భవన్ లాబీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కలుసుకుంటే.. కట్టు కథలు అల్లేస్తారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలతో మీటింగ్‌పై వస్తున్న వార్తలు అవాస్తవమేనని కొట్టిపారేశారు. ఏపీ భవన్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ విప్ కూన రవికుమార్ తనను కలిశారని.. కూన రవి ఆలింగనం కూడా చేసుకున్నారని.. మరి ఆ విజువల్స్ ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ విప్ ఆలింగనం చేసుకున్నంత మాత్రాన.. ఆయన వైసీపీలో చేరుతున్నట్టా అని ప్రశ్నించారు బుగ్గన. టీడీపీ నాయకుల మానసిక స్థితి ఉన్మాదానికి చేరిందన్న ఆయన.. అచ్చెన్నాయుడు మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories