కోర్టు ఆవరణలోనే వైసీపీ కీలక సమావేశం..!

Highlights

ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి...

ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసింది. మొదటగా కడప, కర్నూల్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ యాత్ర సాగుతుంది.. కాగా ఇవాళ జగన్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి తన ఆస్తుల కేసులో సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.. ఈ నేపథ్యంలో అయన నేడు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.. ఇక గతవారం రోజులుగా రాష్ట్రంలోని సమస్యలు, పార్టీపై పలు నేతల విమర్శలపై జగన్ కోర్టు వద్ద అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు.. అంతేకాదు గత మూడు రోజులుగా జనసేన అధినేత పవన్, వైసీపీ పై విమర్శలు, పోలవరం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది..

ప్రజల నాడి పట్టేసిన ప్రశాంత్ కిషోర్..!

ప్రస్తుతం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో యాత్ర సాగుతుండగా ఇవాళ హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు హాజరయి తిరిగి రేపు రాత్రికి శింగనమల చేరుకొని నేటి రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.. కాగా జగన్ పాదయాత్ర ఇప్పటికే 400 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్నట్టు పార్టీ తెలిపింది.. ఇదిలావుంటే జగన్ పాదయాత్రపై తెలుగుదేశం పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు జగన్ కేవలం సరదా , బాడీ ఫిట్నెస్ కోసమే పాదయాత్ర చేస్తున్నారు తప్ప ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు కాదని మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories