యడ్యూరప్ప అనే నేను..అయన గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఇవే!

Submitted by nanireddy on Thu, 05/17/2018 - 10:15
yadyurappa oth as cm of karnataka

నాటకీయ పరిణామాల మధ్య  కర్ణాటక సీఎంగా మూడో సారి యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం. కర్ణాటక రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన యడ్యూరప్ప దక్షిణాది రాష్ట్రాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు.లింగాయత్ సామాజిక వర్గం అండతో  రాజకీయాల్లో గుర్తింపు యెడ్డీ 1943 ఫిబ్రవరి 27న మాండ్య జిల్లా బూకనాకెరెలో జన్మించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి RSSలో చేరిన యడ్యూరప్ప తొలుత 1970లో శికారిపుర RSS కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆ తరువాత 1972లో తాలుకా శాఖ  జనసంఘ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యెడ్డీ 1975లో శికారిపుర పురపాలక సంఘ అధ్యక్షుడిగా గెలుపు సాధించారు.

దేశం ఎమెర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం యెడ్డీని 1988లో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.దాంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అగుపెట్టి 1983లో శికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి  తొలిసారి పోటీ చేశారు..ఇప్పటి  వరకు శికారిపుర నుంచి ఆరు సార్లు విజయబావుటా ఎగురవేశారు. 1999  మినహా ప్రతి ఎన్నికలోనూ విజయం ఆయననే వరించింది. 2007లో తొలి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప బలం నిరూపణలో విఫలం కావడంతో వారానాకే రాజీనామా చేశారు.

తిరిగి 2008 మే 30న రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం  చేసి  అవినీతి ఆరోపణలతో 2011 జులై 31 ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు..  2013 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా  కర్నాటక జనతా పార్టీని స్థాపించారు. సంవత్సరం తిరగకుండానే 2014లో కేజీపీని బీజేపీలో విలీనం చేశారు యడ్యూరప్ప. ఇంత వరకు ఒక్కసారిగా పూర్తి స్ధాయిలో అధికారం అనుభవించని యడ్యూరప్ప హిందు మతంపై భక్తి, జాతకాలను అధికంగా విశ్వసించే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రతిపనిలో ముహూర్తాలు, శకునాలు చూసుకోవడం ఆయనకున్న ముఖ్య అలవాటు  
 

English Title
yadyurappa oth as cm of karnataka

MORE FROM AUTHOR

RELATED ARTICLES