మేరీ కోమ్‌కు‌ దేశవ్యాప్తంగా ప్రశంసలు...

Submitted by chandram on Sun, 11/25/2018 - 10:57
mary

భారత మహిళా బాక్సింగ్ గ్రేట్, ముగ్గురు బిడ్డల తల్లి మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది. ఆరోసారి ప్రపంచ బంగారు పతకం సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచ మహిళా బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్లో 35 ఏళ్ల మేరీ కోమ్ ఉక్రెయిన్ బాక్సర్ హన్నాను చిత్తు చేసింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న2018 ప్రపంచ మహిళా బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్లో  మేరీ కోమ్ ఉక్రెయిన్ బాక్సర్ హన్నాను 5-0తో చిత్తు చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. దీంతో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా ఈ మణిపురి మణిపూస చరిత్ర సృష్టించింది. 

గెలుపునంతరం మేరీ కోమ్ భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. తన ఆరో బంగారు పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు...మేరీకోమ్ ప్రకటించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యం అని తెలిపింది. ముగ్గురు బిడ్డల తల్లి అయిన మేరీ కోమ్ ఆరోసారి ప్రపంచ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 35 ఏళ్ల ఈ మహిళా బాక్సింగ్ గ్రేట్ పై దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల కురుస్తున్నాయి. 

English Title
Women’s World Boxing Championship: Mary Kom beats Hanna Okhota to clinch record 6th gold medal

MORE FROM AUTHOR

RELATED ARTICLES