లైంగిక వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్‌ నేత గండ్ర

Submitted by arun on Mon, 08/06/2018 - 10:35
Gandra

కాంగ్రెస్‌ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లైంగిక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడని కొమురెల్లి విజయలక్ష్మిరెడ్డి అనే మహిళ ఆరోపించింది. గండ్ర వెంకటరమణారెడ్డిపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్‌లో ఆదివారం చీటింగ్ కేసు నమోదైం ది. ఉమ్మడి వరంగల్ జిల్లా పస్రాకు చెందిన కే విజయలక్ష్మీరెడ్డి ఫిర్యాదు మేరకు గండ్రపై 420, 505, 506, 417 సెక్షన్లకింద కేసు నమోదు చేసినట్టు సీఐ సదయ్య తెలిపారు. తనతో నాలుగేండ్లుగా శారీరక సంబంధం పెట్టుకుని ఇప్పుడు మొఖం చాటేశాడని, తనకు న్యాయం చేయాలని విజయలక్ష్మి గండ్ర నివాసముండే వడ్డేపల్లిలోని జీఎంఆర్ బృందావన్ ఆపార్ట్‌మెంట్ ఎదుట ఆందోళనకు దిగింది. తనను మోసం చేసిన వెంకటరమణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అతని నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని, కాపాడాలని వేడుకున్నది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆమెను సముదాయించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించకూడదని సూచించి ఆమెను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. కాగా విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని గండ్ర కొట్టి పారేశారు. తన ఎదుగుదలను చూసి గిట్టనివారే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని కోరారు.

English Title
women-protest-at-congress-leader-gandra-venkata-ramana-reddy-residence

MORE FROM AUTHOR

RELATED ARTICLES