మహిళపై మాజీ భర్త దారుణం..

Submitted by nanireddy on Sat, 11/10/2018 - 08:13
women murder over ex husbend

నాలుగేళ్ళ కిందట విడిపోయిన మాజీ భార్యపై దారుణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమెను అతడి స్నేహితుల చేత అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపించి చిత్రహింసలకు గురిచేశాడు.   
జార్ఖండ్ రాష్ట్రం జంతారా జిల్లా నారాయణపూర్ బ్లాక్ పరిధిలోని గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం ఆ  గ్రామంలో ఉత్సవం జరుగుతుండగా ఓ మాజీ భర్త మరో ఇద్దరితో కలిసి వచ్చి తన మాజీ భార్యను పోలాల్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. అనంతరం అత్యంత దారుణంగా మహిళను వివస్త్రను చేసి కర్రతో కొట్టాడు. వారు పెట్టె బాధలు భరించలేక సదరు  మహిళ గట్టిగా కేకలు వేసింది.  అరుపులు విన్న గ్రామస్థులు ఆమెను మృగాళ్ల బారినుంచి తప్పించారు. అనంతరం వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించి ఆమెకు చికిత్స కోసం ఆసుపత్రిలో  చేర్పించారు.  తన మాజీ భర్తతోపాటు మరో ఇద్దరు కామాంధులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మహిళ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఆ మహిళ ఆరోగ్యం విషమించడంతో ఆమె మరణించింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

English Title
women murder over ex husbend

MORE FROM AUTHOR

RELATED ARTICLES