నాగార్జున ఇంటి ముందు యువతి హల్ చల్!

Submitted by arun on Wed, 07/04/2018 - 11:48
nag

టాలీవుడ్ నటుడు నాగార్జున ఇంటి వద్ద అర్ధరాత్రి ఓ యువతి నానా హంగామా చేసింది. ఈ హీరో తనకు నాలుగు కోట్ల రూ‌పాయలు ఇవ్వాలంటూ రభస చేసింది. దీంతో షాకైన సెక్యూరిటీ.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌కు చేరుకుంది. రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున ఇంటికి వెళ్లింది.  హీరో నాగార్జునను కలవాలని..తనతో మాట్లాడాలని నాగ్ పీఏని కోరింది.  కానీ ఆయన లేరని..షూటింగ్ పనిపై బయటకు వెళ్లారని అక్కడ సిబ్బంది తెలిపారు. అయినా నాగార్జునను ఎందు కలవాలని కోరుకుంటున్నారి ఆయన పీఏ మహిళలను అడిగారు. ఆమె చెప్పిన సమాధానం విని షాక్ తిన్నాడు.  నాగార్జున తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. నాగార్జున లేరని, తర్వాత రావాలని చెప్పినా ఆమె వినిపించుకోకుండా రోడ్డుపై హడావిడి చేసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె మానసిక స్థితి బాగాలేదని తేల్చారు. 

English Title
women hulchul at nagarjuna house

MORE FROM AUTHOR

RELATED ARTICLES