పొలిటికల్‌ గేమ్‌లో వజ్రాయుధంగా మారిన వనితల ఓటు

Submitted by arun on Thu, 12/06/2018 - 15:49
vote

పొలిటికల్‌ గేమ్‌లో వనిత ఓటు వజ్రాయుధంగా మారింది. వంటింటికే పరిమితమైన మగువలు రాజకీయాల అజెండాలను నిర్ధేస్తున్నాయి.  ఫ్యామిలీని బ్యాలెన్స్‌ చేస్తూ తమదైన రంగంలో  చక్రం తిప్పుతున్న అతివలు తమకున్న ఓటు హక్కుతో  నేతల జయాపజయాలను శాసించడం నివ్వెరపరుస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు మహారాణులయ్యారు. అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి చేరారు. ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రంలాంటి ఓటుతో రాజకీయ నాయకుల తలరాతలను మార్చేందుకు మహిళామణులు సన్నద్ధమవుతున్నారు.ఇన్నాళ్లూ ఓటరుగా నమోదయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపని వారు ప్రస్తుతం ఓటరుగా నమోదుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

స్త్రీలు-పురుషులు ఇద్దరూ సమానమే కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. పురుషులపై మహిళలు కాస్త  పైచేయి సాధించారు.  ఓటర్లలిస్ట్‌లో పురుషులతో పోల్చితే మహిళల శాతం బాగా పెరిగింది. దేశ వ్యాప్తంగా  మొత్తం  66 కోట్ల మంది మహిళల్లో ఓటర్ల సంఖ్య  41.5 కోట్లు చేరిందని లెక్క తేల్చేసింది. పైగా మగవారి కంటే  ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్‌ చూపుతున్నారట అతివలు.

మహిళల్లో వస్తున్న మార్పు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 పార్లమెంట్‌ ఎన్నికలనూ ప్రభావితం చూపనుంది. తమ హక్కుల పట్ల మహిళలలో పెరుగుతున్న చైతన్యమే  వారిని పోలింగ్‌ కేంద్రాలకు రప్పిస్తోంది. ఆర్థికంగానే కాక రాజకీయంగానూ వారిని సంఘటితం చేస్తూ ఓటు వేసేందుకు పురిగొల్పుతున్నాయి. మరోవైపు ఎన్నిల సంఘం కూడా తనవంతు ప్రేరణ కలిగించడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. 

ఛత్తీస్‌గడ్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణలలో సంగ్వారీ పేరిట మహిళల కోసం ప్రత్యేక పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు  చేయడంతో పాటు  పూర్తిగా మహిళా సిబ్బందినే నియమిస్తోంది.  మహిళా ఓటర్లు ఓటు బ్యాంకుగా తయారవుతున్న కొద్దీ  రాజకీయ పార్టీలు వారికి గాలెం వేయడంతో పాటు ప్రత్యేక నజరానను ప్రకటిస్తున్నారు. అంతేకాక హక్కుల కోసం పోరాటం చేస్తున్న మహిళలను శాంత పరిచేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకువస్తున్నారు నేతలు. 

కూర్చీల కుమ్ములాటలను ప్రక్కకు పెట్టి మహిళల ఆలోచనా తీరుకు అనుగుణంగా పావులు కదిపితే విజయం వరించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఓటు అస్త్రంతో రాజకీయాలను శాసించే స్ధాయికి చేరిన మహిళలు మునుముందు రాజకీయాల్లో తమదైన ముద్ర వేయడం ఖాయమంటున్నారు.

English Title
woman votes declared the party winner

MORE FROM AUTHOR

RELATED ARTICLES