నేను సల్మాన్ ఖాన్ భార్యని.. చచ్చిపోతా!!

నేను సల్మాన్ ఖాన్ భార్యని.. చచ్చిపోతా!!
x
Highlights

హీరోలను అభిమానించడం.. వారిపై ప్రేమతో ఇళ్లు వదిలి పారిపోవడం లాంటి ఘటనలు గతంలో విన్నాం కానీ.. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విషయంలో జరిగిన ఈ...

హీరోలను అభిమానించడం.. వారిపై ప్రేమతో ఇళ్లు వదిలి పారిపోవడం లాంటి ఘటనలు గతంలో విన్నాం కానీ.. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విషయంలో జరిగిన ఈ ఘటన మాత్రం.. కాస్త కొత్తగా అనిపించక మానదు. ఎందుకంటే.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ గా సల్మాన్ ఖాన్.. ప్రపంచం మొత్తానికీ తెలుసు. పెళ్లి విషయంలో కూడా సల్మాన్ కు ఓ నిర్దిష్ట అభిప్రాయం లేదనీ తెలుసు.

అలాంటి సల్మాన్ ఖాన్.. తన భర్త అనీ.. అతడిని చూడాలని ఉందనీ.. ముంబైలో ఓ యువతి హల్ చల్ చేసింది. ఓ బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానని అందరినీ బెదిరించింది. దగ్గరికి వెళ్లాలని చూసిన వారిని.. తన చేతిలో ఉన్న ఇనుప రాడ్లతో హడలెత్తించింది. ఆఖరికి.. అగ్ని మాపక సిబ్బంది వచ్చి.. బతిమాలి.. బామాలి.. ఆమెను కిందికి దించేందుకు ప్రయత్నించాల్సి వచ్చింది.

సల్మాన్ పై అభిమానంతో ఇంతలా ప్రవర్తించిన ఆ యువతి.. కేవలం అభిమాని మాత్రమేనా.. లేక మానిసక సమస్యతో బాధపడుతోందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. అదీ సంగతి.

Show Full Article
Print Article
Next Story
More Stories