చందానగర్‌లో విషాదం

Submitted by arun on Mon, 01/22/2018 - 17:12
women suicide

హైదరాబాద్ చందానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్ధానికంగా ఉన్న పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌లోని సాయి పెరల్‌ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఓ మహిళ తన కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్‌ మెంట్‌లో నివాసముంటున్న స్వాతి(35) అనే మహిళ.. కూతురు శాన్వీ(1)తో కలిసి ఐదవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో స్వాతి, కుమార్తె శాన్వి(01) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

English Title
woman suicide attempt in chandanagar

MORE FROM AUTHOR

RELATED ARTICLES