పాల కోసం ఏడుస్తున్న బిడ్డ గొంతు కోసిన తల్లి...

Submitted by arun on Fri, 02/09/2018 - 14:16
slits throat

పాలకోసం మారాం చేసిందని ఓ చిన్నారిని కన్నతల్లే గొంతుకోసి చంపేసిన వైనమిది. గురువారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో చోటుచేసుకుందీ దారుణం. ఈ షాకింగ్ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ధర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ..గురువారం బిడ్డతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఓ పక్క బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే ఆమె మాత్రం ఏమీ పట్టనట్టు వంట చేసుకుంటోంది. బిడ్డ ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూనే ఉండడంతో ఇంట్లో ఉన్న కొడవలితో నరికేసింది.

అప్పటివరకు వెక్కి వెక్కి ఏడుస్తున్న పసికందు ఉన్నట్టుండి నిశ్శబ్దంగా ఉండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఇంతలో మహిళ తలుపుకు తాళం వేసి తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె చేతిలో బిడ్డ లేకపోవడం చూసి పక్కింటివారు తలుపు పగలగొట్టి చూశారు. రక్తపుమడుగుల్లో పడి ఉన్న పసికందుని చూసి హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. నిందితురాలిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


 

English Title
Woman Slits One-year-old Daughter's Throat For Demanding Milk, Arrested

MORE FROM AUTHOR

RELATED ARTICLES