యూట్యూబ్ హెడ్‌క్వార్టర్స్‌లో కాల్పులు

Submitted by arun on Wed, 04/04/2018 - 10:40
YouTube

శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ మహిళ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం మహిళ తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది. కాల్పుల శబ్దం విని ఏం జరుగుతోందో తెలియక ఉద్యోగులు సమీపంలోని వీధుల్లోకి పరుగులు తీశారు.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి  పరిస్థితి విషమంగా ఉంది. 

లంచ్ సమయంలో మహిళ క్యాంపస్‌లోని డాబా మీదకు చేరుకుని కాల్పులు ప్రారంభించింది. అనంతరం తనను తాను కాల్చుకుంది. మొత్తం పది రౌండ్లు ఆమె కాల్చినట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదాలతోనే ఆమె ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనక ఉగ్రవాద కోణం లేదని తేల్చి చెప్పారు.

Tags
English Title
Woman shoots and wounds 4 at YouTube before killing herself

MORE FROM AUTHOR

RELATED ARTICLES