తలలోకి కత్తెర దూసుకెళ్లినా.. బస్సెక్కి ఆసుప్రతికి..

Submitted by arun on Sat, 04/07/2018 - 16:51
 Head Stuck With Scissors

ఓ చిన్న దెబ్బ తాకితేనే అయ్యో.. కుర్రో ముర్రో అంటాం. కాని.. ఓ 57 ఏండ్ల మహిళ తలలో కత్తెర గుచ్చుకున్నా... రక్తస్రావం అయినా ఏ మాత్రం భయపడలేదు, టెన్షన్ పడలేదు, హడావుడి చేయలేదు. తనకు ఏం కానట్టు నడుచుకుంటూ వచ్చి బస్సెక్కి ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అయింది. ఈ ఘటన చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. స్థానిక మీడియా ప్రకారం..

హుబేయి ప్రావిన్స్‌కు చెందిన షెన్‌ అనే మహిళ ఇటీవల తన గార్డెన్‌లో మొక్కల ఆకులు కత్తిరిస్తూ ఉంది. కాసేపటి తర్వాత కత్తెరను ఓ చెట్టుకు గుచ్చి కిందకు వంగింది. సరిగ్గా అదే సమయంలో ఆ కత్తెర చెట్టు నుంచి పడిపోయి షెన్‌ తలలోకి గుచ్చుకుంది. అయితే షెన్‌ కొంచెం కూడా భయపడకుండా తనతంట తానే బస్సెక్కి జియాంగ్యాంగ్‌లోని ఆసుపత్రికి వెళ్లింది.

షెన్‌ ఇంటి నుంచి ఆసుపత్రికి దాదాపు గంట ప్రయాణం. అయినా సరే ఒంటరిగానే బస్సెక్కి ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి కత్తెరను తొలగించారు. స్థానిక మీడియా ద్వారా షెన్‌ గురించి తెలిసి ఆమె ధైర్యాన్ని మెచ్చకుంటున్నారు. నిజంగానే మరి.. తలలో కత్తెరతో నొప్పి కలుగుతున్నా ఒంటరిగా ఆసుప్రతికి వెళ్లిందంటే ఆమె ధైర్యవంతురాలే కదా..

English Title
Woman With Scissors Stuck In Head Takes Bus To Hospital

MORE FROM AUTHOR

RELATED ARTICLES