భర్తపై దాడి.. తుపాకీతో వచ్చి కాపాడిన భార్య

Submitted by arun on Mon, 02/05/2018 - 18:17
Wife Gun

ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నోలో ఓ వ్య‌క్తి త‌న ఇంటి ముందు నిల‌బ‌డి ఉండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఒక్క‌సారిగా దూసుకొచ్చి ఆయ‌న‌పై పిడిగుద్దులు కురిపిస్తూ, రాడ్‌తో కొడుతూ దాడి చేశారు. తన భర్తపై కర్రలతో దాడికి చేస్తున్నార‌ని తెలుసుకున్న మ‌హిళ‌ తుపాకీతో బయటకు వచ్చి స‌ద‌రు దుండ‌గుల‌ను బెంబేలెత్తించింది. వివరాల్లోకి వెళితే..లఖ్‌నవూలోని కాకోరీ ప్రాంతానికి చెందిన అబిద్ అలీ వృత్తిపరంగా జర్నలిస్టు. సోమవారం ఉదయం అలీ తన ఇంటి ముందు నిల్చుని మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు అలీపై దాడి చేయడం ప్రారంభించారు. అందులోని ఓ వ్యక్తి పరుగెత్తుకుని వెళ్లి రాడ్‌ తీసుకొచ్చి మరీ అలీని కొట్టాడు. అలీ అరుపులు విన్న అతడి భార్య వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. మామూలుగా కాదు. చేతిలో తుపాకీతో వచ్చి.. దుండగులపైకి గురిపెట్టింది. వారిని భయపెట్టేందుకు కొన్ని రౌండ్లు కాల్పలు కూడా జరిపింది.

దీంతో భయపడిపోయిన ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అయితే అలీపై ఎవరు దాడి చేశారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. కాగా.. అలీ భార్య వృత్తిపరంగా లాయర్‌ అని తెలుస్తోంది.
 

English Title
Woman saves journalist husband from attackers

MORE FROM AUTHOR

RELATED ARTICLES