డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నాకొద్దు సార్‌..!

Submitted by arun on Fri, 02/02/2018 - 17:15

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంధ్రములో మంత్రి కేటీఆర్‌ వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు మంత్రి అధికారులతో కలసి వెళ్లారు. ఆ ప్రదేశములో షరీఫా అనే మహిళ ఒక పూరి గిడిసెలో నివశిస్తుంది. తన బాదను చెప్పుకునేందుకు వచ్చిన ఆమహిళతో మంత్రి కేటీఆర్‌ నీకు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని అన్నారు. కానీ షరీఫా మంత్రితో తనకు ఇందిరమ్మ ఇళ్ల పథకములో గుడిసె వేసుకున్నాని, తనకు డబుల్ బెడ్ రూమ్ వద్దని, తన కన్నా బీద వారు చాలా మంది ఉన్నారని, వారికిస్తే వారు బాగుపడుతారని అనగానే ఒక్క సారిగా మంత్రితో సహా అంతా అవాక్కయ్యారు. కేటీఆర్‌ స్పందిస్తూ తానే వ్యక్తిగతంగా ఇల్లు బాగు చేయిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు.

English Title
Woman Refuses Double Bedroom House

MORE FROM AUTHOR

RELATED ARTICLES