ట్రంప్‌కు వేలు చూపించి..ఉద్యోగం పోగొట్టుకుంది!

Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వర్జీనియాలో పర్యటించారు. సైకిల్‌పై వెళ్తూ డొనాల్డ్‌ ట్రంప్‌కు వేలు చూపించిన ఓ మహిళ తన ఉద్యోగాన్ని...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వర్జీనియాలో పర్యటించారు. సైకిల్‌పై వెళ్తూ డొనాల్డ్‌ ట్రంప్‌కు వేలు చూపించిన ఓ మహిళ తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. పనిచేస్తున్న కంపెనీ నుంచి ఆమెను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జూలీ బ్రిస్క్‌మ్యాన్‌ అనే 50 ఏళ్ల మహిళ గత నెలలో స్టెర్లింగ్‌లో సైకిల్‌పై వెళ్తొంది. అదే సమయంలో ట్రంప్‌ తన కాన్వాయ్‌లో గోల్ఫ్‌ కోర్సుకు వెళ్తున్నారు. వాహనాలు తనను దాటుతున్న సమయంలో ఆమె తన చేతి మధ్య వేలిని ట్రంప్‌ కాన్వాయ్‌ వైపు చూపించింది. అయితే ట్రంప్‌తో ఉన్న ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోను తీశారు. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఆ ఫోటోను జూలీ బ్రిస్క్‌మాన్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ సైక్లిస్ట్ ఓ కమ్యూనికేషన్ కంపెనీలో పనిచేస్తున్నది. దీంతో ఆ కంపెనీ ఆమెపై వేటు వేసింది. తన ఉద్యోగం పోయినా తనకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదని ఆమె చెబుతోంది. ఒబామాకేర్ లాంటి పథకాలను ట్రంప్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆ వుమెన్ సైక్లిస్ట్ వేలు చూపించి నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories