హిట్‌ మర్డర్‌లో కిడ్స్‌ ట్విస్ట్‌...అమ్మనాన్నతో పాటు గడ్డం అంకుల్

Submitted by arun on Fri, 08/10/2018 - 11:07
md

దేవిక భర్త జగన్‌ హత్య కేసులో నిజాలు ఎలా బయటపడ్డాయి ? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు దేవిక ప్రయత్నించిందా ? పోలీసుల విచారణలో దేవిక పిల్లలు ఏం చెప్పారు ? దేవికకు సహకరించిన బెనర్జీని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారు ? 

ఫిలింనగర్‌లో జరిగిన హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన దేవిక ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించింది. భర్త తనను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడి తేగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆగిపోయానంటూ కథ అల్లింది. అమె చెప్పిన సమాచారానికి అక్కడున్న పరిస్థితులు పోలీసులకు భిన్నంగా కనిపించాయ్. ప్రియుడ్ని కాపాడేందుకు తానే భర్తను హత్య చేసినట్లు పోలీసుల ముందు నిజాన్ని అంగీకరించింది. మద్యం తాగి చిత్రహింసలు పెడుతుండడంతో చంపేశానంటూ దేవిక చెప్పింది.

తాగి వచ్చి చిత్రహింసలు పెడుతుండటంతో భర్తను హత్య చేసినట్లు దేవిక చెప్పడంతో పోలీసులకి ఎలాంటి అనుమానం రాలేదు. అయితే, గదిలో ఎవరెవరు ఉన్నారని దేవిక పిల్లలు ఉదయ్‌, జ్యోషితను అడిగిన పోలీసులకు తీగ దొరికింది. అమ్మనాన్నతో పాటు గడ్డం అంకుల్ ఉన్నాడని జ్యోషిత చెప్పడంతో అసలు బాగోతం బయపడింది. దేవిక సోదరుడు రమేష్‌కు గడ్డం ఉండడంతో అతనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

అయితే రమేశ్‌ ఇచ్చిన సమాచారంతో బెనర్జీ హత్యకు సహకరించినట్లు తేలడంతో అడ్వాన్‌ సాఫ్ట్‌ సంస్థకు వెళ్లి అతని గురించి విచారించారు. హత్య జరిగిన ఇంటి టెర్రస్‌పై ఉంటాడని తేలడంతో పోలీసులు బెనర్జీకి ఫోన్‌ చేయడంతో స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అడ్వాన్‌ సాఫ్ట్‌ అధికారితో ఫోన్‌ చేయించి సెల్‌టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బంజారిహిల్స్‌లోని ఆటోలో దాక్కున్న బెనర్జీని పట్టుకున్నారు. జగన్‌ హత్యకు తాను కూడా సహకరించినట్లు బెనర్జీ అంగీకరించాడు. ఫిలింనగర్‌లో జరిగిన హత్యకు వివాహేతర సంబంధామే కారణమని పోలీసుల విచారణలో తేలింది. జగన్‌ను హత్య చేసిన అతడి భార్య దేవికా, ఆమె ప్రియుడు తోట బెనర్జీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

English Title
Woman murders husband with lover in Hyderabad Film Nagar

MORE FROM AUTHOR

RELATED ARTICLES