మా ఆయన అదోటైపు..

Submitted by admin on Tue, 12/12/2017 - 12:52

అరుణ విద్యాసంస్థల యజమాని అంకుష్ పై ఆయన భార్య దీపిక సంచలన ఆరోపణలు చేశారు. హోమో సెక్స్ కి అలవాటుపడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ హైదరాబాద్  సైదాబాద్  పోలీసులను ఆశ్రయించింది. జహీరాబాద్ లో అరుణ స్కూల్ , అరుణభాయ్ డీఈడీ కాలేజీ నడుపుతున్న అంకుష్ తో హైదరాబాద్ కి చెందిన దీపికతో 2014లో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాటి నుంచి తనను దూరం పెడుతున్నాడని దీపిక ఆరోపిస్తోంది. 

కూకట్ పల్లిలో రూమ్  తీసుకుని యువకులతో హోమో సెక్స్ కి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్‌ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని లోపం బయటపడకుండా ఉండేందుకు రోజూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.30 లక్షల కట్నం, 50 తులాల బంగారం ఇచ్చామని వెల్లడించారు. తన జీవితాన్ని నాశనం చేసిన అంకుష్‌పై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English Title
woman-files-complaint-against-husband

MORE FROM AUTHOR

RELATED ARTICLES