ఆమె కిడ్నిలో రాళ్లు.. ఎన్నో తెలిస్తే షాక్ కావాల్సిందే

Submitted by arun on Thu, 07/26/2018 - 16:07
Kidney stones

జ్వరం, వెన్నునొప్పితో హాస్పిటల్ కు వెళ్లిన ఓ మహిళను పరీక్షలు చేసిన అనంతరం... డాక్టర్లే షాక్ తినే విషయం బయటపడింది.  ఆ మహిళ కిడ్నీలో ఒకటి కాదు రెండు కాదు సుమారు 3,000 రాళ్లు ఉన్నట్లు గుర్తించి డాక్టర్లే అవాక్కయ్యారు. ఈ ఘటన చైనాలోని ఉజిన్ ఆసుపత్రిలో వెలుగుచూసింది. షాంగైకి చెందిన మహిళ ఝాంగ్‌(56)కు గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి భాదపడుతుంది. జ్వరంతో పాటు వెన్నునొప్పికి ట్రీట్‌మెంట్‌ కోసం చంగ్జౌలోని వుజిన్‌ ఆస్పత్రికి వెళ్లింది. దీంతో డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, కుడి మూత్రపిండంలో(రైట్‌ కిడ్నీ) వేల సంఖ్యలో రాళ్లున్నాయని గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు దాదాపు 3000 రాళ్లను తొలగించారు. గతంలో మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్‌ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను తొలగించారు వైద్యులు. అధిక సంఖ్యలో కిడ్నిలో రాళ్లు వచ్చిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డులకు కూడా ఎక్కాడు.

English Title
Woman Complained Of Back Pain, Doctors Found Almost 3,000 Kidney Stones

MORE FROM AUTHOR

RELATED ARTICLES