ఫేస్‌బుక్‌లైవ్‌లో..యువతి ఆత్మహత్య

Submitted by nanireddy on Tue, 06/12/2018 - 10:08
woman-commits-suicide-facebook-live-kolkata

నేను చనిపోతున్నా అంటూ ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి మరీ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరగణాస్‌ జిల్లాలోని సోనపూర్‌ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యువతి (22) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. యువతి తల్లి దగ్గరలోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది.ఆమె ఆ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్నారు. తండ్రి, సోదరుడు కూడా పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న యువతి శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఆమె తన ఫేస్‌బుక్‌ ఓపెన్ చేసి లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ చెప్పి ఉరివేసుకుంది. దీంతో  ఆదివారం ఉదయం సదరు యువతి తల్లి వచ్చి తలుపులు తెరవగా లోపల ఫ్యాన్ కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీంతో బోరున విలపించింది తల్లీ. కాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇదిలావుంటే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్త్తున్నారు. 

English Title
woman-commits-suicide-facebook-live-kolkata

MORE FROM AUTHOR

RELATED ARTICLES