గుడ్డు పగిలిందని.. అంబులెన్స్‌కు ఫోన్‌

Submitted by arun on Mon, 01/29/2018 - 13:48

మీరు చదువుతున్నది నిజమే.. గుడ్డు పగిలిపోయిందని ఓ మహిళ అంబులెన్స్‌ సర్వీస్‌కు ఫోన్‌ చేసింది. ఆ గుడ్డును ఏం చేయాలో చెప్పండని సలహా అడిగింది. ఈ వింతైన ఘటన వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్‌ లోని నాటింగ్హామ్‌ లో ఈస్ట్‌ మిడ్‌ ల్యాండ్స్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ నెంబర్ (999) కు అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎమర్జెన్సీ సర్వీస్ కావడంతో ఫోన్ ఎత్తిన సర్వీస్ అధికారి... రోగి శ్వాస తీసుకోగలుతున్నాడా? అని పదేపదే ప్రశ్నించాడు. దీనిని పట్టించుకోని సదరు మహిళ... నాకు మీ నుంచి ఒక సలహా కావాలి అని అడిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది.

అధికారి : రోగి మీరేనా?
మహిళ: (మౌనం) మీ సలహా కావాలి
అధికారి: సరే ఇంతకీ మీకేం కావాలి?
మహిళ: మా ఫ్రిజ్‌లో ఒక బాక్సు నిండా గుడ్లు ఉన్నాయి. అందులో ఒకటి పగిలిపోయింది. దీంతో నేను మిగతా గుడ్లన్నీ బాక్సు మూతలోకి మార్చాను. ఆ బాక్సు రాత్రంతా తెరిచే ఉంది. గుడ్ల బాక్సును రాత్రంతా ఫ్రిజ్‌లో తెరిచి పెట్టొచ్చా?
అధికారి: (ఆశ్చర్యపోయి) ఇది అంబులెన్స్‌ సర్వీస్‌... అత్యవసరమైతేనే దీనికి ఫోన్‌ చేయాలి
అని చెప్పి, ఎంతోమంది ఎమర్జెన్సీ కోసం వాడే నెంబర్ ను ఆకతాయి పనికి వాడకూడదని చీవాట్లు పెట్టారు. అనంతరం తమ విధులకు ఎలా ఆటంకం కలుగుతుందో చెబుతూ, ఆ కాల్ రికార్డింగ్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది వైరల్ గా మారింది. దానిని మీరు కూడా చూడండి. అలాంటి మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు మండిపడుతున్నారు.
 

English Title
woman calls 999 over broken eggs in fridge

MORE FROM AUTHOR

RELATED ARTICLES