ప్రేమోన్మాది ఘాతుకం..యువతి దారుణహత్య

Submitted by arun on Wed, 01/10/2018 - 11:26
woman murdered

హైదరాబాద్‌‌లో మరో ప్రేమోన్మాది బరి తెగించాడు. ప్రేమించడం లేదంటూ మూసాపేట్‌ హబీబ్‌నగర్‌లో ప్రేమోన్మాది ఆనంద్‌ యువతిని పొడిచి చంపాడు. మూసాపేట్ డిమార్ట్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తున్న బోను జానకిపై ఆనంద్‌ కత్తితో దాడి చేశాడు. జానకి గదిలోకి ప్రవేశించి కత్తితో పొత్తి కడుపులో పొడిచాడు. దాంతో జానకి అక్కడికక్కడే మరణించింది. జానకి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మూసాపేట్‌ డి-మార్ట్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తున్న జానకి, స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. అయితే డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చిన రూమ్‌మేట్‌ రక్తపుమడుగులో పడివున్న జానకిని ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించాలంటూ వెంటపడుతున్న యువకుడు ఆనంద్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. తనను ప్రేమించాలని కొద్దిరోజులుగా వేధిస్తున్న ఆనంద్‌‌ను జానకి నిరాకరించడంతోనే ఆమెపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించేవాడని చివరికి అన్నంత పనీ చేశాడని జానకి స్నేహితురాళ్లు చెబుతున్నారు.

English Title
woman brutally murdered

MORE FROM AUTHOR

RELATED ARTICLES