కోరిక తీర్చుకొని ఆమె సంసారంలో నిప్పులు పోశాడు..

కోరిక తీర్చుకొని ఆమె సంసారంలో నిప్పులు పోశాడు..
x
Highlights

పచ్చని కాపురంలో ఓ ప్రబుద్ధుడు చిచ్చురేపా డు. సజావుగా సాగుతున్న వారి సంసారాన్ని చిన్నాభిన్నం చేశాడు.. స్నానం చేస్తున్న దృశ్యాలను ఫొటోలు తీసి... వాటితో...

పచ్చని కాపురంలో ఓ ప్రబుద్ధుడు చిచ్చురేపా డు. సజావుగా సాగుతున్న వారి సంసారాన్ని చిన్నాభిన్నం చేశాడు.. స్నానం చేస్తున్న దృశ్యాలను ఫొటోలు తీసి... వాటితో బెదిరించి లోబర్చుకున్నాడు... విషయం భర్తకు తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటు భర్త.. అటు లోబర్చుకున్న యువకుడి వేధింపులు పడలేక మహిళ బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట అత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఆత్మహత్యకు కారకుడైన వెంకటేష్‌ (19) అనే యువకుడిని మంగళవారం బోయినపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బోయినపల్లి సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట్‌ జిల్లా ఆత్మకూర్‌ మడలం దాచారం గ్రామంకు చెందిన ఎస్‌.వెంకటేష్‌ (19) అనే యువకుడు 2017లో హైదరాబాద్‌కు వచ్చి బేగంపేట్‌ సమీపంలోని అన్నానగర్‌ బస్తీలో ఓ బంగ్లాలో నివాసం ఉంటూ బేగంపేట్‌లోని క్రీమ్‌బెల్‌ ఐస్‌క్రీం కంపెనీలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం సబిత (26) అనే గృహిణి తన భర్త దినేష్‌తో పాటు తన ఇద్దరి పిల్లలతో కలిసి అన్నానగర్‌ బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకునివారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వెంకటేశ్ సబితపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని కుట్రపడ్నాడు. ఓ రోజు సబిత బాత్‌రూంలో స్నానం చేస్తుండగా... ఫోన్‌తో ఆ దృశ్యాలను రికార్డు చేశాడు. తన కోరిక తీర్చకపోతే సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించి లోబర్చుకున్నాడు. ఇలా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలియ డంతో దంపతుల మధ్య సంతవ్సర కాలంగా గొడవలు జరుగుతున్నాయి. నీ విషయాన్ని బయటపెడతాను, నీ పిల్లల్ని చంపేస్తానంటూ వెంకటేష్‌ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో సబిత తనలో తానే కుమిలిపోయింది. ఈ విషయంపై అప్పటికే ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఆమె విషయాన్ని పట్టించుకోకపోవడం, రోజూ వెంకటేష్‌ వేధింపులు ఎక్కువ కావడం, భర్త దూరం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సబిత ఈ నెల 4వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో బస్సులో బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న బస్‌స్టాప్‌కు చేరుకుంది. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే కూర్చుని ఉంది. ఇంతలో ఏమి జరిగిందో ఏమోగాని తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ బాటిల్‌ తీసింది. పోలీస్‌స్టేషన్‌ ముందు పోలీసులు గాని, మరెవరూ లేని సమయంలో పరుగులు తీస్తూ పెట్రోల్‌ ను ఒంటిపై చల్లుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. ఇది గమనించిన పోలీసులు మంటలను ఆర్పి హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె 70 శాతానికి పైగా కాలిపోయిందని, ఆస్పత్రివర్గాలు వెల్ల డించాయి. చికిత్స పొందుతూ రెండురోజుల తర్వాత సబిత ఆస్పత్రిలో మృతి చెందింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో చనిపోయే ముందు తాను విసిరేసిన బ్యాగ్‌ను పరిశీలించిన పోలీసులకు సూసైడ్‌ నోట్‌ దొరికింది. తన చావుకు కారణం వెంకటేష్‌ అని అందులో పేర్కొంది. ఈ సూసైడ్‌ నోట్‌ ప్రకారం విచారణ మొదలుపెట్టిన పోలీసులకు పటాన్‌ చెరువు ఇస్నాపూర్‌ వద్ద వెంకటేష్‌ ఉన్నాడనే విశ్వసనీయ సమాచారం దొరికింది. మంగళవారం నిందితుడు వెంకటేష్‌ను మంగళవారం ఉదయం 8:30 గంటలకు అదుపులోకి తీసుకుని అతనివద్ద ఉన్న సెల్‌పోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories