తమిళ నాట ఏం జరుగుతోంది.. కరుణానిధిని మోడీ అందుకే కలిశారా?

Submitted by arun on Tue, 12/26/2017 - 12:04
tamil nadu

తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయా?.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం ఆ రాష్ట్ర రాజకీయాలనే మార్చేయబోతోందా? పళని,పన్నీర్ తో దినకరన్ ఢీకొడుతుంటే ఉనికి కోసం ప్రయత్నిస్తున్న కమలం డిఎంకె నీడన చేరుతుందా? వాట్ నెక్స్ట్? 

తమిళనాట కాలు మోపాలని తహతహలాడుతున్న బీజేపీకి ఆర్కే నగర్ బై పోల్స్  పెద్ద షాకిచ్చాయి దక్షిణాదిన విరబూయాలని  ఆశపడుతున్న కమలానికి అదంత ఈజీ కాదని తేల్చేశారు నల్లతంబిలు..మరిప్పుడు బీజేపీకి ఏం చేస్తుంది?

తమిళనాట సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి గుజరాత్ ఎన్నికలు నేర్పిన పాఠంతో జాగ్రత్తగా అడుగులేస్తున్న కమలనాథులకు ఆర్కే నగర్ ఉప ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి బీజేపీ అభ్యర్ధి కనీసం సోదిలోకి లేకుండా పోయాడు బీజేపీ అభ్యర్ధికి పోలయిన ఓట్ల కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉన్నాయన్న వార్తలు కమలనాధులను పూర్తి నిరాశ పరిచాయి. బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు కేవలం వెయ్యి417 మాత్రమే నోటాకు రెండు వేల 373 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి నాగార్జున ఓటమి పాలు కావడం ఇది రెండవ సారి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మైలాపూర్ నుంచి పోటీ చేసిన నాగర్జున ఓడిపోయారు అయినా దక్షిణాదినా తమ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్న బీజేపీకి ఇప్పుడు కిం కర్తవ్యం అని ఆలోచిస్తోంది.

హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 18 రాష్ట్రాల్లో జెండా పాతిన బీజేపీ దక్షిణాదిన పట్టు కోసం తెగ తాపత్రయ పడుతోంది. అందుకే వచ్చే ఏడాది జరిగే కర్ణాటక ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో అడుగులేస్తోంది కేరళలో అడుగు పెట్టేందుకు ప్రయత్నించిన బీజేపీ యోగీ ఆదిత్య నాథ్, అమిత్ షా లాంటి నేతలతో కలసి జనరక్షా యాత్రలు కూడా చేసింది. ఇప్పుడు తమిళనాడులో చక్రం తిప్పాలంటే ఏం చేయాలి? బీజేపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకే పెద్ద పీట అధికారం డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్యే మారుతూ ఉంటుంది. ఏ జాతీయ పార్టీ అయినా ఈ పార్టీలతో పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేయాలి తప్పితే సొంతంగా రాణించే పరిస్థితి లేదు జయ మరణంతో వీధిన పడిన అన్నా డిఎంకే రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ ఒక దశలో పళనీ, పన్నీర్ వర్గాలకు సానుకూలంగా కనిపించింది.  కానీ ఆ పార్టీలో అంతర్గత పోరు చూశాక బీజేపీ దృష్టి డిఎంకే పై పడిందా?

ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా డిఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కలిశారు. కుశల ప్రశ్నలు వేశారు పైకి మర్యాద పూర్వకమైన భేటీ యే అని చెప్పినా కమలం డిఎంకేకి కన్ను గీటుతోందన్న పుకార్లు షికారు చేశాయి బీజేపీతో కలిసేది లేదని పైకి స్టాలిన్ ప్రకటించినా లోలోపల 2జి స్కామ్ నుంచి బయట పడేందుకు రెండు పార్టీల మధ్య ఒప్పందాలుకూడా కుదిరిపోయాయనే రూమర్లూ వినిపించాయి ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చేలా 2జి స్పెక్ట్రమ్ స్కామ్ నుంచి కనిమొళి, రాజా నిర్దోషులుగా బయటపడ్డారు ఈ పరిణామాలు చూస్తే బీజేపీ, డిఎంకే  పొత్తుకు మార్గం సుగమం అయిందనే అనుమానాలు కలుగుతున్నాయి అన్నాడిఎంకే పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన బీజేపీ వ్యూహాత్మకంగానే డిఎంకేను మంచి చేసుకుంటోందా? 2019 సార్వత్రిక ఎన్నికలకు ఈ రెండు పార్టీలు కలసి పనిచేస్తాయా అన్నది తేలాలి.

English Title
Will DMK now align with BJP?

MORE FROM AUTHOR

RELATED ARTICLES