చిరు సినిమాను దాటేస్తున్న రంగస్థలం క‌లెక్షన్స్

చిరు సినిమాను దాటేస్తున్న రంగస్థలం క‌లెక్షన్స్
x
Highlights

ఊహించినట్టుగానే ‘రంగస్థలం’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా...

ఊహించినట్టుగానే ‘రంగస్థలం’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. సుకుమార్ తీర్చిదిద్దిన ఈ కళాఖండానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఎన్నడూ చూడని రామ్ చరణ్‌ను చిట్టిబాబులో చూశామంటూ అభిమానులు పొంగిపోతున్నారు. 1980ల నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండిస్తోంది.

నాన్ బాహుబలి రికార్డ్స్‌లో నంబర్ వన్ పొజిషన్ దిశగా దూసుకెళ్తోంది ‘రంగస్థలం’. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు సాధించిన వసూళ్లను మినహాయిస్తే.. మిగతా తెలుగు సినిమాల వసూళ్లలో టాప్ పొజిషన్‌కు చేరుకునేలా ఉంది రామ్ చరణ్ సినిమా. ఇప్పటికే ‘రంగస్థలం’ షేర్ వసూళ్ల విషయంలో వంద కోట్ల రూపాయల మొత్తానికి దగ్గరవుతోంది. దేశీయంగా ఈ సినిమా దాదాపు 80 నుంచి 90 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించినట్టుగా తెలుస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్ ను కలుపుకుంటే ఈ సినిమా వసూళ్లు అలవోకగా వంద కోట్ల రూపాయల మొత్తానికి దగ్గరవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు సినిమా చరిత్రలో టాప్ వసూళ్ల సినిమాల జాబితాను పరిశీలిస్తే, వాటిల్లో మూడో స్థానానికి చేరువవుతోంది రంగస్థలం. తొలి రెండు స్థానాల్లో బాహుబలి 2, బాహుబలి సినిమాలున్నాయి. ఇప్పటి వరకూ మూడో స్థానంలో మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ 150’ ఉంది. ఇప్పుడు చిరు సినిమా వసూళ్ల రికార్డులను చరణ్ సినిమా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద రంగస్థలానికి ఎదురు లేని పరిస్థితే ఉంది. గత వారంలో నితిన్ సినిమా ‘చల్ మోహన్ రంగ’ వచ్చింది. అది సో.. సో.. అనిపించుకుంది. ఇక ఈ వారంలో వచ్చిన నాని సినిమా ‘కృష్ణార్జునయుద్ధం’ కూడా జస్ట్ యావరేజ్ అనిపించుకుంటోంది. దీంతో ‘రంగస్థలం’కు తగిన పోటీ ఇచ్చే సినిమాలు ప్రస్తుతానికి లేనట్టే. వచ్చే వారంలో మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ విడుదల అయ్యేంత వరకూ ‘రంగస్థలం’కు ఎదురు లేకపోవచ్చు. ఆ లోపు ఈ సినిమా ‘ఖైదీ 150’ వసూళ్ల మార్కును అధిగమించేసి, నాన్ బాహుబలి రికార్డ్స్ లో నంబర్ వన్ పొజిషన్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories