పిన్నితో అక్రమ సంబంధం ఎంతకు దారి తీసిందంటే...

పిన్నితో అక్రమ సంబంధం ఎంతకు దారి తీసిందంటే...
x
Highlights

సొంత పిన్నితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తనకు అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతో పినతండ్రినే హతమార్చాడు. ఈ నెల 13న విజయనగరం జిల్లా డెంకాడ మండలం...

సొంత పిన్నితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తనకు అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతో పినతండ్రినే హతమార్చాడు. ఈ నెల 13న విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసకు చెందిన బాడిదపోయిన రాములప్పడు (30) విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లిలో హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు గౌరి అందించిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఆనందపురం పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. విచారణ పూర్తి చేసిన సీఐ ఆర్‌.గోవిందరావు అందించిన నివేదిక మేరకు శనివారం మధురవాడ ఏసీపీ బీవీఎస్‌.నాగేశ్వరరావు నిందితుడిని అరెస్టు చేసి భీమిలి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన బాడితబోయిన రాములప్పడు (31)తో పద్మనాభం మండలం కురపల్లి గ్రామానికి చెందిన నర్సయ్యమ్మకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. ఇటుకల బట్టీలో కూలీగా పనిచేస్తున్న రాములప్పడు తరచూ ఇతర ప్రాంతాలకు వెళుతుంటాడు. ఈ నేపథ్యంలో మూడు నెలల నుంచి నర్సయ్యమ్మకు సొంత అక్క కుమారుడు, గొట్టిపల్లి గ్రామానికి చెందిన గండిబోయిన అప్పలరాజుతో సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాములప్పడు భార్య నర్సయ్యమ్మను మందలించాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నర్సయ్యమ్మ పథకం పన్ని అప్పలరాజుకు పురమాయించింది. పని నిమిత్తం ఎల్‌.కోట వెళ్లిన రాములప్పడు ఈ నెల 13వ తేదీన తోడల్లుడు, అప్పలరాజు తండ్రి అయిన గండిబోయిన రమణ ఇంటికి వచ్చాడు. మోదవలస నుంచి నర్సయ్యమ్మ కూడా వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గండిబోయిన అప్పలరాజు, అతని తమ్ముడు ఎల్లారావులు రాములప్పడుతో కలిసి చందక వచ్చి మందు కొనుగోలు చేశారు. అక్కడ నుంచి గొట్టిపల్లి సమీపంలో వున్న డబ్బీరు శ్రీనివాసరావుకు చెందిన మామిడితోటకు వెళ్లారు. రాములప్పడుకు అన్నదమ్ములిద్దరూ కలిసి మద్యం తాగించారు.

అనంతరం పక్కనే వున్న సరుగుడు కర్రతో కొట్టి కింద పడిపోగానే గొంతు, నోరు గట్టిగా నొక్కి గుండెపై బలంగా గుద్దారు. దీంతో రాములప్పడు అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయాడని నిర్ధారించుకుని పక్కనే వున్న కాలువలో పడేసి ఊళ్లోకి వెళ్లి...చిన్నాన్న మందు ఎక్కువై కాల్వలో పడిపోయాడని చెప్పారు. ఆటో తీసుకువెళ్లి రాములప్పడును ఇంటికి తీసుకువచ్చారు. మందు ఎక్కువై పడిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. స్థానికంగా వున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ను పిలిపించగా మృతి చెందినట్టు చెప్పారు. దీంతో మృతదేహాన్ని అదే ఆటోలో హుటాహుటిన అతని సొంత గ్రామమైన మోదవలస పంపించి వేశారు.

ఒంటి మీదున్న గాయాలను చూసిన రాములప్పడు తమ్ముడు బాడితబోయన గౌరి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ గణేష్‌ సిబ్బంది కేసును దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ఎ-1గా గండిబోయిన అప్పలరాజు, ఎ-2గా అతడి తమ్ముడు గండిబోయిన ఎల్లారావు, ఎ-3గా మృతుడి భార్య నర్సయ్యమ్మను పై కేసును నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories