భర్త నోట్లో 'హిట్‌' కొట్టి చంపేసింది..

Submitted by arun on Tue, 08/07/2018 - 10:27
 filmnagar

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో భార్య భర్తను చంపేసింది. బస్తీలో కొంతకాలంగా భార్య దేవిక, భర్త జగన్‌ కలిసి నివసిస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో కానీ, రాత్రి ఫుల్‌గా తాగొచ్చాడు జగన్‌. ఈ క్రమంలో మత్తులో ఉన్న జగన్‌ నోట్లో హిట్‌ కొట్టి మరీ చంపేసింది దేవిక. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ గొడవలతోనే హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితమే గుంటూరు జిల్లా మాచర్ల నుండి దంపతులిద్దరూ హైదరాబాద్‌కి వచ్చారు.

గుంటూరు జిల్లా మాచర్లకి చెందిన జగన్.. దేవిక భార్య భర్తలు. అయితే పెళ్లైనప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. జగన్‌ రోజూ ఫుల్‌గా మద్యం సేవించి, దేవికను చిత్రహింసలకు గురిచేసేవాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వేధింపులు తాళలేక భార్య దేవిక అవకాశం చూసుకుని భర్త జగన్‌ను హతమార్చింది. ప్రస్తుతం నిందితురాలు దేవికను... పోలీసులు విచారిస్తున్నారు.

English Title
wife kills her husband in hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES