ప్రియుడిచేత భర్తను హత్య చేయించిన భార్య..

Submitted by nanireddy on Sun, 07/01/2018 - 07:00
wife-killed-husband-khammam

ప్రియుడిచేత కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేయించిందో మహిళ ఈ ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.ఖమ్మం జిల్లా గార్ల మండలం ముత్తితండాకు చెందిన భూక్యా రమేష్‌(30), కమల దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. రమేష్‌ గార్లకు చెందిన ఆగడాల రామారావు వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. రామారావు రమేష్ ఇంటికి తరచు వస్తుండేవాడు. ఈ క్రమంలో  రమేష్ భార్య కమలతో సాన్నిహిత్యం  ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజులకు వీరి వ్యవహారం రమేష్ కంటపడింది. దీంతో భార్యను మందలించాడు. రామారావు వద్ద డ్రైవర్ పని మానేసి వేరే పని చూసుకోవడానికి గతనెల 12న ఖమ్మం కు వెళ్ళాడు. అతని స్నేహితుడైన సురేష్  తారసపడ్డాడు. అతను జేసీబీ డ్రైవర్ గా పనిచేసేవాడు.దీంతో  రమేష్ ను జెసిబి వద్ద పనికి పెట్టుకుంటానని అతనికి మాట ఇచ్చాడు సురేష్. అనంతరం ఇద్దరు కలిసి  మధ్యంసేవించారు. తనవద్ద డ్రైవర్ గా మానేసి జెసిబికి వెళుతున్నాడనే విషయం భార్య  కమలకు ఫోన్ చేసి చెప్పాడు రామారావు. వివాహేతర సంబంధం కొనసాగలేదేమోనని భర్తను చంపెయ్యల్సిందిగా రామారావుకు పురమాయించింది కమల. దీంతో రామారావు తన వద్ద పనిచేసే మరో డ్రైవర్ కృష్ణమాచారి డబ్బు ఆశచూపి హత్యకు పథకం పన్నారు. ఇక బార్ లో మద్యం సేవించి ఇంటికి బైక్ పై బయలుదేరాడు రమేష్. దీంతో అప్పటికే మార్గం మధ్యలో మాటువేశాడు రామారావు, కృష్ణమాచారి. సడన్ గా బైక్ ఆపి అతనిపై దాడి చేశాడు రామారావు.. అనంతరం బైక్ ఇద్దరు కలిసి రమేష్ గొంతుకోసి చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడినుంచి పారిపోయారు. కానీ అనూహ్యంగా సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులకు చిక్కారు. దీంతో రమేష్ భార్య కమల, ఆమె ప్రియుడు రామారావు మరో నిందితుడు కృష్ణమాచారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  

English Title
wife-killed-husband-khammam

MORE FROM AUTHOR

RELATED ARTICLES