ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Submitted by nanireddy on Thu, 08/02/2018 - 08:37
wife-killed-husband-east-godavari

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిందో ఇల్లాలు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరంలో జరిగింది. రాజమహేంద్రవరం హుకుంపేటకు చెందిన   వడ్డి ఇమ్మానియేల్, దేవి దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె  సంతానం ఉన్నారు. ఇమ్మానియేల్  భవన నిర్మాణ పనులకు వెళుతుండేవాడు. అతనితో పాటు శివ అనే యువకుడు కూడా ఆ పనికి వస్తుండేవాడు. ఈ క్రమంలో శివ అప్పుడప్పుడు ఇమ్మానియేల్ ఇంటికి వస్తుండేవాడు. దాంతో దేవి పరిచయమై వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ విషయం ఇమ్మానియేల్ కు మందలించాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. అయితే కుటుంబసభ్యులు భార్యభర్తలకు   నచ్చజెప్పి భర్త ఇంటికి పంపించారు. అయితే దేవి పిల్లల్ని స్కూల్ కు తీసుకువచ్చే క్రమంలో  మళ్ళీ శివతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం ఇమ్మానియేల్ తన స్నేహితుల ద్వారా తెలుసుకుని భార్యపై గొడవకు దిగాడు. ఆ తరువాత భర్తపై కోపాన్ని పెంచుకున్న దేవి విషయాన్నీ ప్రియుడు శివకు తెలియజేసింది. అతను మర్డర్ ప్లాన్ చెప్పాడు. జూలై 26న రాజమహేంద్రవరం మార్కెట్‌ సెంటర్‌కు రావాలని ఇమ్మానియేల్‌ను శివ కోరాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గోకవరం మీదుగా రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని తాగారు. తరువాత  భార్య దేవి కూడా ఆ చోటుకు వచ్చింది. 'నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్‌' అంటూ ఇమ్మానియేల్‌  భార్యను ప్రశ్నించాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే ఇమ్మానియేల్‌ మద్యం మత్తులో ఉన్నాడు.  దేవి, శివలు కలిసి ఇమ్మానియేల్‌ గొంతు నొక్కి చున్నీతో గట్టిగా చుట్టడంతో మృతి చెందాడు. ఆ తరువాత పెట్రలో పోసి తగలబెట్టారు. భర్తను ఎవరో హత్య చేసారంటూ కుటుంబసభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్య ఘటనాస్థలిలో వదిలివెళ్లిన సెల్ ఫోన్ ఆధారంగా నిందితులు భార్య దేవి ఆమె ప్రియుడు శివ గా పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. 

English Title
wife-killed-husband-east-godavari

MORE FROM AUTHOR

RELATED ARTICLES