ఓ మహిళా తన భర్తను చంపేసి ఏమి చేసిందో తెలుసా..?

Submitted by admin on Tue, 12/12/2017 - 16:11

ఓ మహిళా తన భర్తను చంపేసి విషయం బయట పడతాదేమోనని  ఎన్ని జిమ్మిక్కులు చేసిందో చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు.. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 65 ఏళ్ల వయసున్న బార్బరా వొజియాక్ అనే మహిళ తన భర్త 72 ఏళ్ల ఆల్ఫెడ్ వొజియాక్‌‌ను హత్య చేసింది. ఓ తుపాకీతో కాల్చి చంపింది. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లడంతో ఆల్ఫ్రెడ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నించిన బార్బరా ఓ పథకాన్ని రచించింది. మృతదేహాన్ని ఓ టేపుతో చుట్టింది. ఇంట్లోని ఓ ప్రదేశంలో మృతదేహాన్ని ఉంచి అడ్డుగా ఇటుకగోడను నిర్మించింది.

 దీంతో విషయాన్ని బయటకు రాకుండా చేసింది. కానీ గుర్తుతెలియని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. హత్య జరిగిందని భావిస్తున్నానని, బార్బరా ఇంట్లో తనిఖీ చేయాల్సిందిగా పలు వివరాలతో సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు గోడను కూల్చి మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా తన భర్త నుంచి వేధింపులు ఎక్కువ అవడంవల్లే అతన్ని అంతమొందించానని ఆమె తెలిపింది..

English Title
wife-killed-her-husbend

MORE FROM AUTHOR

RELATED ARTICLES