దేశం మొత్తం తెలంగాణ వైపే ఎందుకు చూస్తోంది?

Submitted by chandram on Thu, 12/06/2018 - 20:15
tg


తెలంగాణలో మహాయుద్ధాని మరికొన్ని గంటలే సమయం ఉంది. దీంతో పోల్ తెలంగాణ కోసం అధికారయంత్రాంగం సర్వం సిద్దం చేసింది. భారీ భద్రత మధ్య ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లను తీసుకొని పోలింగ్ కేంద్రాలకు బయల్దేరుతున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపే ఎందుకు చూస్తోంది? మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ఎందులో ఎందుకు స్పెషల్?  పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సమస్యత్మాక ప్రాంతాలుగా గుర్తించిన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగిలిన చోట్ల ఐదు గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణలో జరిగే పోలింగ్ మీదే ఉంది.

English Title
Why is the whole country going to Telangana?

MORE FROM AUTHOR

RELATED ARTICLES