తుమ్మును ఆపితే ప్రాణం పోవాల్సిందే

Submitted by lakshman on Mon, 01/22/2018 - 07:36
Sneezing

మనం తుమ్మితే.. ‘చిరంజీవ’ అని పెద్దలు అంటుంటారు. తుమ్మిన వెంటనే బయటికి పోవద్దని, కాసేపు ఆగి, నీళ్లు తాగివెళ్లాలని చెబుతున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా అదే చెబుతున్నారు. తుమ్ము విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని, తుమ్మును ఆపితే ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు.
గంటలకు వంద మైళ్ల వేగంతో వచ్చే తుమ్మును బలవంతంగా ఆపితే చనిపోయే ప్రమాదం కూడా ఉందని లీసెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. లండన్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి  ఇటీవల తుమ్మును ఆపేందుకు ముక్కు, రంధ్రాలు నోరు ఒకేసారి మూశాడు. దీంతో తుమ్మవేగానికి అతడి గొంతులోపల రంధ్రం ఏర్పడింది. తర్వాత గొంతు మారిపోయింది
గొంతు వాచిపోయి నొప్పి ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేయగా, గొంతులో రంధ్రం ఏర్పడిందని, గాలి బుడగలు.. వేగంగా వెళ్లి గుండె కండరాలు, కణజాలాల్లోకి చేరాయని తేలింది. ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశముండేదన్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నారు.
‘తుమ్ముతో గాలి బలంగా ముక్కు, నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఆపితే ప్రతికూల ప్రభావం ఉంటుంది.  తుమ్ములోని గాలి బుడగలు గుండె, మెదడు కణజాలాల్లోకి దూసుకెళ్లి, వెంటనే మరణం సంభవించే అవకాశముంది. రక్తనాళాలు కూడా పగిలిపోతాయి. కాబట్టి తుమ్ము ఆపొద్దు..’ అని సూచిస్తున్నారు.

English Title
Why Holding in a Sneeze Can Be Dangerous

MORE FROM AUTHOR

RELATED ARTICLES