గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా..?

Highlights

సాధారణంగా గుడికివెళ్ళిన కొందరు భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.. కొందరైతే ఆత్మ ప్రదక్షిణ చేస్తారు.. మరికొందరు దేవుడి చుట్టూ లేదా గుడి చుట్టూ ప్రదక్షిణలు...

సాధారణంగా గుడికివెళ్ళిన కొందరు భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.. కొందరైతే ఆత్మ ప్రదక్షిణ చేస్తారు.. మరికొందరు దేవుడి చుట్టూ లేదా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.. ఇలాగా ప్రదక్షిణలు రెండు రకాలుగా మనం చెప్పుకుంటున్నాం.. అసలు ఈ ప్రదక్షలు ఎందుకు చేస్తారు..? మనిషికి ఏదైనా కోరిక ఉంటే మనసులో దేవుడిని ప్రార్ధిస్తూ తన కోరిక తీర్చమని దేవుడికి ఇష్టమైన నైవేద్ధ్యం లేదా కొబ్బరికాయ కొట్టి అర్థిస్తారు.. కానీ దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముందనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు... అసలు దీనికి సంభంధమేంటని అరా తీస్తే కొందరు పండితులు ఇలా చెబుతున్నారు..

మనకి కనిపించే 'సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.

ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం 'చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇలా మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది.. తద్వారా మనిషికి ప్రశాంతత, జ్ఞానం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.. కానీ ఈ పద్ధతిని ఒక్క హిందువులుమాత్రమే ఆచరిస్తుండటం గమనార్హం..

Show Full Article
Print Article
Next Story
More Stories