ఇంతకీ రేవంతుడు ఏ పార్టీలో ఉన్నాడబ్బా...?!!

Submitted by santosh on Wed, 05/09/2018 - 10:33
in which party belongs to revanth reddy (5815)

తెలంగాణ కాంగ్రెస్‌లో తెలుగుదేశం పార్టీని పొగిడే నాయకుడు ఉన్నాడంటే నమ్ముతారా? పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జపం చేసే నాయకుడు ఉన్నారంటే కాంగ్రెస్ కార్యకర్త జీర్ణించుకోగలడా? కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో అదే జరుగుతోంది. సైకిల్ పార్టీని వీడి దాదాపు ఏడాది కావస్తున్నా... ఆ పార్టీనీ, దాని అధినేతను మరువలేకపోతున్నారు ఒక నాయకుడు. దీంతో ఆయన ఏ పార్టీలో ఉన్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. 

తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడు, గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట‌్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇంకా ఆ తీపి జ్ఞాపకాలను మరువలేక పోతున్నట్టున్నారు. హస్తం పార్టీకి ప్రత్యర్థి అయిన పసుపు పార్టీని ఆయన ఇంకా పొగుడుతూనే ఉన్నారు. అందుకే చాలా సభలు, సమావేశాల్లో సైతం తెలుగుదేశం పార్టీ బడుగుల పార్టీ. బడుగులకు న్యాయం చేసిన పార్టీ అని కూడ అన్నారు. 

ప్రస్తుతం ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడంతో రేవంత్ రెడ్డి టీడీపీ, దాని అధినేత చంద్రబాబు నామస్మరణలో మునిగి తేలుతున్నారు. చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడారు. తమను వ్యతిరేకించే వారిని బెదిరించేందుకు కేసులు పెడతామంటే ఊరుకునేది లేదని ఆగ్రహించారు. తనపై, చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. విభజన హామీలను అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకొచ్చి ప్రజల్లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రధాని ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్ కేసుల పేరుతో నాటకమాడుతున్నారని విమర్శించారు. వైరి పార్టీలో ఉన్నా ఓటుకు నోటు కేసులో టీడీపీని, ఆ పార్టీ అధినేతను వెనకేసుకు రావడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. కాంగ్రెస్ పార్టీనేతలు రేవంత్ తీరును ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.  

English Title
in which party belongs to revanth reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES