ఏ రాత్రి శివ రాత్రి..?

Submitted by arun on Mon, 01/29/2018 - 14:02
Maha Shivaratri

ఉపవాశం ఎప్పుడు ఉండాలి..? జాగారం ఎప్పుడు చెయ్యాలి..? ఫైనల్ గా శివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి..? శివరాత్రిపై క్లారిటీ లేకపోవడంతో భక్తులకు వస్తున్న సందేహాలు ఇవి.. సంక్రాంతి తరహాలోనే... శివరాత్రి పర్వదినం విషయంలోనూ అవే సందేహాలు...శివభక్తులు పరమ పవిత్రంగా జరుపుకొనే శివరాత్రి ఎప్పుడనే అంశంపై పంచాంగ కర్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పంచాంగాల్లో శివరాత్రి ఫిబ్రవరి 13న అని, మరికొన్ని పంచాంగాల్లో 14న అని చెప్పడంతో.. ఏ రోజున శివరాత్రి జరుపుకోవాలనే అంశంపై ప్రజల్లో సందేహాలు వస్తున్నాయి. 

శివభక్తులు పరమ పవిత్రంగా జరుకొనే శివరాత్రి ఎప్పుడు అన్న సందేహాలు నెలకొన్నాయి.. దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లోనూ వేర్వేరు తేదీల్లో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శివరాత్రి పర్వదినాన్ని ఫిబ్రవరి 13న అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి. అయితే మాఘ బహుళ చతుర్దశి నాడు శివరాత్రిని జరుపుకోవడం సంప్రదాయం. ఫిబ్రవరి 13న రాత్రి 10 గంటల35 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంది. అప్పటి నుంచి 14వ తేదీ అర్ధరాత్రి 12గంటల 47 గంటల వరకు చతుర్దశి ఉంది. ఇదే అంశం పంచాంగకర్తల్లో భిన్నవాదనలకు తెరతీసింది.

సాయింత్ర సమయంలో చతుర్దశి తిథి ఉండటం శివరాత్రి పర్వదినాన్ని నిర్ణయించేందుకు ప్రాతిపదిక... అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగేవేళ కూడా చతుర్దశి తిథి ఉండాలని కొందరు పంచాంగకర్తలు, పండితులు అంటున్నారు. 13వ తేదీ రాత్రి 10.35 గంటల వరకు త్రయోదశి తిథే ఉన్నదని, ప్రదోష కాలంలో చతుర్దశి లేదు కాబట్టి ఆ రోజున శివరాత్రి జరుపుకోవడం సరికాదని, అందువల్ల 14నే శివరాత్రి జరుపుకోవాలని కొందరు వాదిస్తున్నారు. ప్రదోషకాలం మాస శివరాత్రికి మాత్రమే ప్రధానమని, మహాశివరాత్రికి కాదని మరికొందరి వాదన.

14న లింగోద్భవ సమయంలో కొద్దిసేపే చతుర్దశి ఉన్నందున 13నే మహాశివరాత్రి జరుపుకోవాలని ఆ వర్గం స్పష్టం చేస్తోంది. పైగా 14న అర్ధరాత్రి సమయంలో చతుర్దశి వెళ్లిపోయి అమావాస్య వస్తుంది కాబట్టి, అమావాస్య స్పర్శతో వున్న రోజున శివరాత్రి జరుపుకోవడం మంచిది కాదని వారు అంటున్నారు. శ్రీశైలం దేవస్థానంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు శైవక్షేత్రాల్లో 13న శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం 14 శివరాత్రి జరుపుతున్నారు. కాశీతో పాటు పలు జ్యోతిర్లింగాల్లో కూడా 13నాడే శివరాత్రి జరుపుతున్నందున ఆ రోజూ ఉత్సవాలు నిర్వహించాలని మరో వర్గం వాదిస్తోంది. మొత్తానికి ఇలా పంచాగ కర్తలు.. పండితులు, శివరాత్రిపై సరైన క్లారటీ ఇవ్వక పోవడతో.. శివరాత్రి పర్వదినంపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి.. ఏ రాత్రి శివరాత్రి చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

English Title
When is Maha Shivaratri in 2018?

MORE FROM AUTHOR

RELATED ARTICLES