వాట్సాప్ లో ఈ ఫీచర్ గురించి తెలుసుకున్నారా?

Submitted by arun on Tue, 03/06/2018 - 10:55
WhatsApp

వాట్సాప్ లేనిదే.. మనకు తెల్లారదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా.. చెప్పిన విషెస్ కు రిప్లై చూసుకోవాలన్నా.. కొత్త అప్ డేట్స్ తెలుసుకోవాలన్నా.. ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారన్న స్టేటస్ తెలుసుకోవాలన్నా.. అంతా ఇప్పుడు వాట్సాప్ మయమే అయిపోయింది. ఇలా పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకూ.. అప్ డేట్స్ అన్నీ అందులోనే అప్ డేట్ అవుతున్నాయి.

ఈ ఎక్సర్ సైజ్ లో.. పొరపాటున ఒకటి టైప్ చేయబోయి ఇంకొకటి చైప్ చేస్తే.. ఒకరికి ఒక మెసేజ్ పంపబోయి మరొకరికి పంపితే.. ఇంకేమైనా ఉందా? అసలే అంతా ఈ మధ్య మరీ సెన్సిటివ్ అయిపోతున్నారు. తప్పుడు మెసేజ్ వస్తే చాలు.. తెగ టెన్షన్ పడిపోవడమో.. లేదంటే సీరియస్ అవడమో జరిగిపోతోంది. అందుకే.. వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మెసేజ్ పోస్ట్ చేసిన తర్వాత.. అది తప్పుగా పోస్ట్ చేశామని తెలుసుకుంటే.. డిలీట్ చేసే సదుపాయాన్ని సవరించింది.

ఇప్పటి వరకూ పోస్ట్ చేసిన మెసేజ్ లను.. కేవలం 7 నిమిషాలలోపే డిలీట్ చేసే వెసులుబాటు ఉంది. ఇప్పుడు.. ఆ అవకాశాన్ని 68 నిమిషాల వరకూ పొడిగించింది. దీంతో.. గంట లోపు కూడా తప్పుడు మెసేజ్ లను గుర్తిస్తే.. దాన్ని డిలిట్ చేసే అవకాశం ఇప్పుడు యూజర్ల సొంతమైంది. సో.. మీ వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోండి మరి.
 

Tags
English Title
WhatsApp’s ‘Delete for Everyone’ unsend feature is about to get way better

MORE FROM AUTHOR

RELATED ARTICLES