మార్చి 14.. ప‌వ‌న్ ఏం చేయ‌బోతోన్నారు.. ?

Submitted by lakshman on Sat, 03/10/2018 - 20:48
pawan kalyan

జ‌నసేన పార్టీ ఆవిర్భావ స‌భ‌ను అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ స్థాయిలో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ వేదిక‌పైనే పార్టీ విధివిధానాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చాలా మంది రాజ‌కీయ నిర్వాసితులు జ‌న‌సేనలోకి వెళ్లే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీ ఆవిర్భావ స‌భ ఏర్పాట్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌ను కాంగ్రెస్ నుంచి జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్న మాదాసు గంగాద‌ర్ కు అప్ప‌గించారు ప‌వ‌న్. 

పార్టీ ఆవిర్భావ స‌భ‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించేందుకు ప‌వ‌న్ సంక‌ల్పించారు. గుంటూరులోని నాగార్జున యూనివ‌ర్సిటీ ఎదురుగా మార్చి 14న స‌భ జ‌ర‌గ‌నుంది. దీనికోసం  క్షేత్ర స్థాయి నుంచే జనాలను సమీకరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలి రావాలని పవన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. అంతేకాదు దీనికోసం ఓ పాటను కూడా పవన్ విడుదల చేశారు.

ఈనేప‌థ్యంలో మార్చి 14న సాయంత్రం జ‌ర‌గ‌నున్న స‌భ‌లో పార్టీ విధివిధానాలు.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌నుంది అన్న విష‌యాల‌ను ప‌వ‌న్ వివ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవ‌ల పవన్ పై వస్తున్న విమర్శలకు కూడా సరైన సమాధానాలు ఇస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మ‌రి మొత్తానికి మార్చి 14న పవన్ ఎలా స్పందిస్తారో.. 
 

English Title
What's pawan kalyan going to do on march 14th

MORE FROM AUTHOR

RELATED ARTICLES